ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AK Singhal: రాష్ట్రంలో 1,460 మ్యూకోర్‌ మైకోసిస్ కేసులు: ఎ.కె.సింఘాల్‌ - Andhra Latest News

కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోందని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.కె.సింఘాల్‌ తెలిపారు. కాల్ సెంటర్‌కు వచ్చే ఫోన్లు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోందని వ్యాఖ్యానించారు. కోటీ 6 లక్షల మందికి 2 డోసుల వ్యాక్సిన్ పూర్తి చేశామని చెప్పారు. 45 ఏళ్లు దాటిన వారిలో 50 శాతం మందికి ఒక డోసు పూర్తి చేశామన్నారు. కారంచేడు వైద్యుడు భాస్కర్‌ కొవిడ్ చికిత్స ఖర్చు ప్రభుత్వానిదేనని చెప్పారు.

ఎ.కె.సింఘాల్‌
ఎ.కె.సింఘాల్‌

By

Published : Jun 5, 2021, 7:03 PM IST

రాష్ట్రంలో కరోనా(corona) ఉద్ధృతి క్రమంగా తగ్గుతోందని ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎ.కె.సింఘాల్‌(AK Singhal) వివరించారు. వివిధ ఆస్పత్రుల్లో 406 టన్నుల ఆక్సిజన్ వినియోగంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో 1,460 మ్యూకోర్‌మైకోసిస్ (black fungus) కేసులు నమోదయ్యాయని ఎ.కె.సింఘాల్‌ వెల్లడించారు. కాల్ సెంటర్‌కు వచ్చే ఫోన్లు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో 11వ విడత కూడా ఫీవర్ సర్వే పూర్తయ్యిందని తెలిపారు. కోటీ 6 లక్షల మందికి 2 డోసుల వ్యాక్సిన్ పూర్తి చేశామని చెప్పారు. 45 ఏళ్లు దాటిన వారిలో 50 శాతం మందికి ఒక డోసు పూర్తి చేశామన్నారు. కారంచేడు వైద్యుడు భాస్కర్‌ కొవిడ్ చికిత్స ఖర్చు ప్రభుత్వానిదేనన్న సింఘాల్‌... చికిత్స కోసం సీఎం జగన్‌ రూ.కోటి మంజూరు చేశారని వెల్లడించారు.

ఇదీ చదవండీ... Environment day: భావితరాలకు పచ్చని భూమిని పదిలంగా అందించాలి: సీఎం

ABOUT THE AUTHOR

...view details