ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sonu Sood: 'నా భార్యది గోదావరి జిల్లా.. ఏపీ, తెలంగాణలు నాకు రెండో ఇల్లు' - sonu sood oxygen cylinders in kurnool

నేను ఆంధ్రా అల్లుడిని.. నా భార్య గోదావరి ప్రాంతం కావటంతో.. ఈ ప్రాంతాల(ఏపీ, తెలంగాణ)తో నాకు ఏదో తెలియని బంధం ఏర్పడిందన్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఇప్పటికే ఆయన స్థాపించిన ఆక్సిజన్​ ప్లాంట్ల కార్యక్రమాన్ని కూడా.. ఆంధ్రా​ నుంచే శ్రీకారం చుట్టారు..! తాజాగా తెదేపా అధినేత చంద్రబాబుతో వర్చువల్ గా సమావేశంలో మాట్లాడిన సోనూసూద్.. మరోసారి తెలుగు రాష్ట్రాలంటే ఇష్టమని.. తనకి రెండో ఇల్లులాంటిదంటూ ప్రస్తావించాడు. కొవిడ్​పై పోరాటంలో చంద్రబాబుతో కలిసి నడిచేందుకు సంతోషంగా ఉందన్నారు.

బాలీవుడ్ నటుడు సోనూసూద్
Sonu Sood

By

Published : Jun 12, 2021, 5:02 PM IST

Updated : Jun 12, 2021, 5:14 PM IST

'నా భార్యది గోదావరి జిల్లా.. ఏపీ, తెలంగాణలు నాకు రెండో ఇల్లు'

సోనూ సూద్.. కరోనా వేళ రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకున్నాడు..! ఒక్క చిన్న ట్వీట్ చేస్తే చాలు.. దేశంలో ఏ మారుమూల ప్రాంతమైనా స్పందించాడు.. స్పందిస్తూనే ఉన్నాడు..! సామాన్యుడి నుంచి స్టార్ల(హీరో, క్రికెటర్లు) వరకూ ఎవరూ సాయం అడిగినా.. తన వంతు ఏదో ఒకటి చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు సోనూ భాయ్..! లాక్​డౌన్ వేళ సొంత ప్రాంతాలకు వెళ్లలేక అవస్థలు పడ్డ.. ఎంతోమంది అభాగ్యులను వారి ఇళ్లకు చేర్చి ఆపద్భాంధవుడు అయ్యాడు ఈ బాలీవుడ్ నటుడు..! సెకండ్ వేవ్​లోనూ తన వంతు కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నాడు. అయితే తాజాగా తెదేపా అధినేత చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. తనకు ఆంధ్రా, తెలంగాణ అంటే రెండో ఇల్లు లాంటివి అంటూ తెలుగు రాష్ట్రాలపై ఆయనకున్న ప్రేమను చాటాడు.

ఆంధ్రా అల్లుడిని..

దేశానికి కరోనా విసురుతున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు అన్న అంశంపై.. వివిధ రంగాల నిపుణులు, ప్రముఖులతో తెదేపా అధినేత చంద్రబాబు వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నటుడు సోనూసూద్​తో పాటు వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోనూసూద్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నేను ఆంధ్రా అల్లుడినే.. నా భార్య గోదావరి ప్రాంతానికి చెందిన అమ్మాయి కావటంతో.. ఈ ప్రాంతాలతో నాకు ఏదో తెలియని బంధం ఏర్పడింది. ఏపీ, తెలంగాణ తనకి రెండో ఇల్లు లాంటిందని ప్రస్తావించాడు.

చంద్రబాబు దూరదృష్టితోనే...

'నటుడిగా కెరీర్ ప్రారంభించిన రోజుల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిగేది. హైదరాబాద్ ఐటీ రంగం అభివృద్ధిలో ఎవరి పాత్ర ఎవరిదనే ప్రశ్న తలెత్తినప్పుడు చంద్రబాబు పేరు సమాధానంగా వినబడేది. చంద్రబాబు దార్శనికత గల నాయకుడు. దూరదృష్టితో ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు.' - సోనూసూద్, బాలీవుడ్ నటుడు

కొవిడ్‌పై పోరాటంలో ఇద్దరి ఆలోచనలు కలవడంపై సోనూసూద్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాసేవకు ఐక్య కార్యాచరణ రూపొందిద్దామని చంద్రబాబు సూచన చేయగా.. సోనూసూద్ అంగీకరించారు. తెలుగు రాష్ట్రాల్లో 18 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తొలిదశలో కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్‌తో పాటు 4 చోట్ల ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆక్సిజన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాయని.. ప్రజాసేవకు స్పందించే ప్రతి ఒక్కరూ నిజమైన హీరోలేనని భావిస్తున్నట్లు తెలిపారు. ఇతరులకు సాయం చేసే శక్తి లేదు.. ఎలా చేయాలో.. ఏం చేయాలో అని అనుకోవద్దని సోనూసూద్ అన్నారు. ఎప్పుడూ ప్రతి ఒక్కరూ వారివారి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దని సోనూసూద్ కోరారు.

ఇదీ చదవండి:

'యూవీ.. నా కొడుకు కెరీర్​ను ముగించినందుకు థ్యాంక్యూ'

Last Updated : Jun 12, 2021, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details