ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఇవాళ్టితో ప్రారంభమైంది. మంగళవారం రాత్రి హైదరాబాద్ మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలతో ముస్లింలు పర్వదినానికి స్వాగతం పలికారు.
నేటి నుంచి రంజాన్ మాసం... ప్రారంభమైన దీక్షలు - makkah masjid hyderabad news
నేటి నుంచి రంజాన్ మాసం ప్రారంభమైంది. ప్రత్యేక ప్రార్థనలతో ముస్లింలు పర్వదినానికి స్వాగతం పలికారు. కొవిడ్ నిబంధనలు పాటించి ప్రార్థనలు చేసుకోవాలని.. ముస్లిం మతపెద్దలు, పోలీసులు సూచించారు.
![నేటి నుంచి రంజాన్ మాసం... ప్రారంభమైన దీక్షలు ramzan month](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11394559-892-11394559-1618362081201.jpg)
రంజాన్ మాసం
నమాజ్కి వెళ్తున్న ముస్లింలకు చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు మాస్కులు పంపిణీ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ నమాజ్ చేసుకోవాలని సూచించారు. మక్కా మసీద్లోనూ భౌతిక దూరం, శానిటైజేషన్ వంటి ఏర్పాట్లు చేశామని ముస్లిం మత పెద్దలు తెలిపారు. సోదరులు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.
ఇవీచూడండి:ముస్లింల సంక్షేమాన్ని వైకాపా గాలికొదిలేసింది: నారా లోకేశ్