ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సిక్కు స్నేహితునికి.. అంత్యక్రియలు చేసిన ముస్లింలు

వారి స్నేహాన్ని కరోనా అడ్డుకోలేకపోయింది. కొవిడ్​తో చనిపోయిన వారికి.. సొంత వారే అంత్యక్రియలు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్న ఈ తరుణంలో మానవత్వాన్ని, స్నేహభావాన్ని చాటారు కొందరు యువకులు. మహమ్మారి కోరల్లో చిక్కుకొని మరణించిన మిత్రుడికి సంప్రదాయ పద్ధతిలో ఆఖరి వీడ్కోలు పలికారు.

muslims conducting funeral for sikh friend
సిక్కు స్నేహితునికి ముస్లింలు అంత్యక్రియలు

By

Published : May 20, 2021, 12:11 PM IST

కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని శాస్త్రీ రోడ్డులో మతీన్ స్నేహితుల బృందం నివాసముంటుంది. ఈ సభ్యుల్లోని అనూప్​సింగ్​ ఇటీవల కరోనా బారినపడ్డాడు. స్నేహితులందరూ అతనికి ధైర్యం నూరిపోశారు. ఏమీ కాదు నీకు అంటూ భరోసానిచ్చారు. కానీ అనూప్​సింగ్ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.

స్నేహితడు మృతి చెందినా.. వారంతా అతనిని విడిచిపోలేదు. తమ మతం కాదని ఆలోచించలేదు. ఆస్పత్రి నుంచి మొదలుకుని.. సిక్కు పద్ధతి అనుసరించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. స్నేహానికి కులమతాలే కాదు.. ఏ వైరస్​ కూడా అడ్డురాదని నిరూపించి ఆదర్శంగా నిలిచారు ఈ స్నేహ బృందం.

ABOUT THE AUTHOR

...view details