తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ ప్రాంతంలో జరిగిన హత్యాచార ఘటనపై యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగ్రహం, విచారం వ్యక్తం అవుతోంది. సైదాబాద్ హత్యాచార ఘటనలో చిన్నారికి న్యాయం జరగాలన్నా.. ఆమె ఆత్మ శాంతించాలన్నా.. నిందితుడు పల్లకొండ రాజు దొరకాలని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఆకాంక్షించారు. హైదరాబాద్ నగర పోలీసులు విడుదల చేసిన ఆధారాల ద్వారా ఈ నిందితుడిని పట్టుకున్న వారికి రూ. 10 లక్షలు రివార్డు ప్రకటించిందని చెప్పారు. ఈ క్రమంలో తన వంతుగా రాజును పట్టించిన వారికి రూ. 50,000 ఇస్తానని వెల్లడించారు.
నిందితుడు దొరకాలని... పోలీసులు ఇచ్చిన అన్ని ఆధారాలతో మనం అతడిని పట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చని ఆర్పీ పేర్కొన్నారు. కానీ చేతిపై "మౌనిక' అనే పచ్చబొట్టు తప్పకుండా అతడిని పట్టించేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అతను మనకు దగ్గర్లోనే ఉండొచ్చని.. నిఘా వేసి ఉంచాలని సూచించారు. నిందితుడిని పట్టుకోవడంలో పోలీసు శాఖకి సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి:Saidabad rape case: హత్యాచార నిందితుడు రాజును పట్టిస్తే రూ. 10 లక్షలు