రాజధాని అమరావతి కేవలం 29 గ్రామాలది కాదని... 13 జిల్లాల ప్రజలది అని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. విజయవాడలో మాట్లాడిన ఆయన... మథర్ థెరిస్సా జన్మదినం రోజున.. పెద్ద సంఖ్యలో అమరావతి మహిళలను అరెస్టు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని పరిధిలోని పేదలకు ఐదు వేల పెన్షన్ ఇస్తామని చెప్పిన జగన్... ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. వైకాపా ఇచ్చిన వాగ్దానాలకు.. చేసే పనులకు పొంతన లేదన్నారు. కౌలు పెన్షన్ల కోసం ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడమేంటని నిలదీశారు. 72గంటల్లో రాజధాని రైతులకు కౌలు, పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు.