ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పురపాలక సంఘాలకు రూ.16.18 కోట్లు పరిహారం.. కాగ్ నివేదికలో వెల్లడి - ఈరోజు కార్మికుల ఈపీఎఫ్​పై నష్టపరిహారం వార్తలుట

పురపాలక సంఘాలు పారిశుద్ద్య కార్మికుల ఈపీఎఫ్ చెల్లించని కారణంగా కోట్ల రూపాయలు పరిహారం చెల్లించారని.. కాగ్ 2020 నివేదికలో పేర్కొంది. 2008 జూన్‌-2018 ఆగస్టు మధ్య, 2018 ఏప్రిల్‌, 2019 మార్చిలో ఒప్పంద ఉద్యోగుల నుంచి మినహాయించిన మొత్తాలను 2 నుంచి 1,849 రోజుల ఆలస్యంగా జమ చేశాయి. అందుకుగాను ఈ మొత్తాన్ని పరిహారం చెల్లించినట్లు పేర్కొంది.

CAG report
కాగ్ 2020 నివేదిక

By

Published : May 24, 2021, 10:54 AM IST

రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం నగరపాలక సంస్థలతోపాటు కల్యాణదుర్గం, మచిలీపట్నం, మైదుకూరు, పలాస-కాశీబుగ్గ, పులివెందుల పురపాలక సంఘాలు కోట్ల రూపాయలు పరిహారం చెల్లించారు. పని చేస్తున్న ఉద్యోగుల భవిష్య నిధిని(ఈపీఎఫ్‌) సకాలంలో జమ చేయనందున వాటిపై వడ్డీ, పరిహారం కింద రూ.16.18 కోట్లు చెల్లించాల్సి వచ్చినట్లు కాగ్‌ గుర్తించింది. ఈమేరకు 2020 నివేదికలో వివరాలను వెల్లడించింది.

ఉద్యోగులు, కార్మికుల వేతనాల నుంచి మినహాయించే ఈపీఎఫ్‌ మొత్తానికి యాజమాన్యం వంతు కలిపి మాసాంతం నుంచి 15 రోజుల్లోగా భవిష్య నిధికి జమ చేయాలి. అయితే రెండు నగరపాలక సంస్థలు, మరో ఐదు పురపాలక సంఘాలు 2008 జూన్‌-2018 ఆగస్టు మధ్య, 2018 ఏప్రిల్‌, 2019 మార్చిలో ఒప్పంద ఉద్యోగుల నుంచి మినహాయించిన మొత్తాలను 2 నుంచి 1,849 రోజుల ఆలస్యంగా జమ చేశాయి. ఈ జాప్యానికి ఆ సంస్థలపై ఈపీఎఫ్‌వో జరిమానా విధించింది. ఇందులో గతేడాది రూ.8.12కోట్లు చెల్లించాయని కాగ్‌ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details