ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

counting: కొనసాగుతున్న పుర ఓట్ల లెక్కింపు - ఏపీ మునిసిపల్ ఓట్ల లెక్కింపు

నెల్లూరు నగరపాలక సంస్థ, కుప్పం సహా 12 మున్సిపాలిటీలతో పాటు సోమవారం పోలింగ్‌ జరిగిన అన్ని చోట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కుప్పం మున్సిపాలిటీని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపాలిటీ ఫలితంపై ఆసక్తి నెలకొంది.

municipal votes counting ap
municipal votes counting ap

By

Published : Nov 17, 2021, 11:06 AM IST

రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక, పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నెల్లూరు కార్పొరేషన్‌, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు డీకేడబ్ల్యూయూ కళాశాలలో జరుగుతోంది. కడప జిల్లా రాజంపేట పురపాలిక, కమలాపురం నగర పంచాయతీల్లోనూ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కమలాపురం నగర పంచాయతీ ఫలితాల్లో ...7 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన 13 వార్డుల్లో లెక్కింపు కొనసాగుతోంది. కాకినాడ నగర పాలక సంస్థలోని 4 డివిజన్లలో లెక్కింపు జరుగుతోంది. అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీలో ఓట్ల లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదు. సూపర్‌వైజర్లు రాకపోవడంతో రిజర్వ్‌ సిబ్బందితో లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీల్లో 4 వార్డుల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు. 13వ వార్డులో వైకాపా అభ్యర్థి గెలుపొందగా....8వ వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. మిగిలిన వార్డుల్లో లెక్కింపు కొనసాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పురపాలిక 23వ వార్డు ఉపఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి రమాదేవి గెలిచారు. కర్నూలు జిల్లా బేతంచర్ల నగర పంచాయతీ, నందికొట్కూరు మున్సిపాలిటీ పదో వార్డు, జీవీఎంసీ పరిధిలో 31, 61 డివిజన్లకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details