ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

DUMP YARD: చెత్త పన్ను చెల్లించలేదని... అక్కడ అంతపని చేశారట - ఇంటి పన్ను

Garbage in Front of home at jagityala: మున్సిపాలిటీ అధికారులు ఈ మధ్య కాలంలో పన్ను వసూళ్ల కోసం కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. ఇంటిపన్ను చెల్లించకపోతే నీటి సరఫరా నిలిపివేయడం, నోటీసులు ఇవ్వడం వంటివి చేస్తారు. కానీ తెలంగాణలోని జగిత్యాల పురపాలక సిబ్బంది చేసిన నిర్వాకం అందరినీ విస్తుపోయేలా చేసింది.

DUMP YARD
చెత్తపన్ను చెల్లించలేదని ఇంటిముందు చెత్త

By

Published : Mar 24, 2022, 6:24 PM IST

చెత్తపన్ను చెల్లించలేదని ఇంటిముందు చెత్త

Garbage in Front of home at jagityala: తెలంగాణలోని జగిత్యాల జిల్లా మున్సిపాలిటీ అధికారులు పన్ను వసూళ్లను సీరియస్​గానే తీసుకున్నారు. నయానో భయానో చెబితే కుదరడం లేదని.. కొత్తగా ఆలోచించారు. ఎప్పటిలా ఇంటిపన్ను చెల్లించకపోతే నీటి సరఫరా నిలిపివేయకుండా.. కొత్త దారిలో వెళ్లారు. ఓ ఇంటి యజమాని పన్ను చెల్లించలేదని ఇంటి ఆవరణాన్ని డంపింగ్‌ యార్డుగా మార్చారు. ఇంటి ముందు చెత్త పోసి పన్ను చెల్లించాలని డిమాండు చేశారు. దీంతో బాధితుడు ఆందోళనకు దిగారు.

మున్సిపల్ కమిషనర్ ఆదేశం మేరకు..

Jagityala Municipality: తెలంగాణలోని జగిత్యాలలోని బంజారు దొడ్డివాడకు చెందిన అహ్మద్‌ బిన్‌సాలెం ఇంటిపన్ను రూ.50 వేలు, మరో రూ.50 వేలు వడ్డీతో కలిపి లక్ష బాకీ పడ్డాడు. పన్ను చెల్లించాలని ఎన్ని సార్లు సూచించిన ఇంటి యజమాని పట్టించుకోకపోవటంతో మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూపరాణి ఆదేశం మేరకు సిబ్బంది ట్రాక్టర్‌తో చెత్తను తెచ్చి ఇంటిముందు పోశారు. దీంతో బాధితుడు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. తన ఆర్థిక పరిస్థితి బాగాలేక చెల్లించలేక పోయానని రూ.25 వేలు చెల్లిస్తానన్నా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details