తెలంగాణలో9నగరపాలక సంస్థలు, 120పురపాలక సంస్థల్లో ఓట్ల లెక్కింపుప్రారంభమైంది. సుమారు 10 వేల మంది సిబ్బంది కౌంటింగ్లో పాల్గొన్నారు.
ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 134 కేంద్రాల్లో 2వేల 559 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు సిబ్బంది కౌంటింగ్ చేయనున్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియను 2వేల 958 మంది సూపర్ వైజర్లు, 5వేల 756 మంది అసిస్టెంట్లు పర్యవేక్షించనున్నారు. మధ్యాహ్నం 12గంటల వరకు తొలి ఫలితం... సాయంత్రానికల్లా పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి.
వార్డుసభ్యుల పదవుల కోసం మొత్తం 12,948 మంది ఎన్నికల బరిలో నిలిచారు. పార్టీలపరంగా చూస్తే అధికార తెరాస నుంచి 2,975 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున 2,619 మంది, భాజపా నుంచి 2,321 మంది అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తెలుగుదేశం తరపున 347 మంది, మజ్లిస్ నుంచి 297 మంది పోటీ చేశారు. సీపీఐ, సీపీఎంల నుంచి 180, 165 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఇతర పార్టీల అభ్యర్థులు 284 మంది కాగా... స్వతంత్రులు 3,760 మంది ఉన్నారు