తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మంగపేట మండలం నరసింహసాగర్ సమీప అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మణుగూరు మావోయిస్టు దళ కమాండర్ రవ్వ రాము అలియాస్ సుధీర్, దళ సభ్యుడు లాక్మాల్ మృతి చెందారు. కాగా వారి మృతదేహాలను ములుగు ఏరియా ఆసుపత్రికి తరయించి పోలీసుల భారీ బందోబస్తు మధ్య పోస్టుమార్టం నిర్వహించారు.
తెలంగాణ: మణుగూరు మావోయిస్టు దళసభ్యుల మృతదేహాలు అప్పగింత - ములుగు ఎన్కౌంటర్ మృతదేహాల అప్పగింత
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా నరసింహ సాగర్ అటవీ ప్రాంతంలోని కొప్పుగుట్ట, ముసలమ్మగుట్ట ప్రాంతాల్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం విధితమే. కాగా మృతుదేహాలకు ములుగు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం డెడ్‌బాడీలను వారి కుటుంబీకులకు అప్పగించారు.

తెలంగాణ: మణుగూరు మావోయిస్టు దళసభ్యుల మృతదేహాలు అప్పగింత
అయితే డెడ్‌బాడీలను వెంకటాపురం మండలం జెల్లా గ్రామానికి చెందిన మృతుడు సుధీర్‌ని.. అతని చిన్నాన్న రాము బంధువులకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్నపురం గ్రామానికి చెందిన మడకం లాక్మాల్ మృతదేహాన్ని అతడి తల్లి ఇడిమీ, కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇదీ చూడండి:తాడ్వాయిలో ఎదురుకాల్పులు... ఇద్దరు మావోయిస్టులు మృతి