ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిందితుడు లేడు... నిజం తేలేదెలా!?

తెలంగాణ అబ్దులాపూర్​మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సురేశ్​... మూడు రోజులుగా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఈ కేసులో నిందితుడు చనిపోవటంతో విచారణ ఎలా సాగుతుందనే విషయంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

తహసీల్దార్ హత్య

By

Published : Nov 7, 2019, 10:58 PM IST

Updated : Nov 8, 2019, 9:47 AM IST

నిందితుడు లేడు... నిజం తేలేదెలా!?

తెలంగాణలోని అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన ఘటనలో తీవ్ర గాయాలపాలైన నిందితుడు మృతి చెందాడు. హైదరాబాద్​లోని ఉస్మానియా ఆస్పత్రిలో మూడురోజులుగా సురేశ్ చికిత్స పొందుతున్నాడు. నిన్నరాత్రి నుంచి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుండగా... వెంటిలేటర్​పై చికిత్స అందించారు. పరిస్థితి విషమించి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

స్వగ్రామానికి సురేశ్ మృతదేహం...

పోలీస్​ బందోబస్తు నడుమ మృతదేహాన్ని గౌరెల్లికి తరలించారు. తన కొడుకు ఎప్పుడూ... తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లలేదని సురేశ్ తండ్రి కృష్ణయ్య తెలిపారు. అసలు ఈ హత్య ఎందుకు చేశాడనేది తమకు అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మూడు ఎకరాల భూమిలోని 9 గుంటల స్థలాన్ని మల్‌రెడ్డి రాంరెడ్డికి అమ్మినట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనలో నిందితుడు కూడా మృతి చెందటం వల్ల పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బంధువులు ఆరోపిస్తున్నట్లు సురేష్​ను ఈ హత్యకు ఎవరైనా ఉసిగొల్పారా... లేక ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడా... అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ కాల్ డేటా ఆధారంగా మిగిలిన వివరాలు తెలుస్తాయని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.

ఇవీ చూడండి

ఆర్టీసీ విలీనానికి అవరోధాలు లేవు : మంత్రి పేర్ని నాని

తెలుగుదేశం పార్టీకి సాధినేని యామిని రాజీనామా

Last Updated : Nov 8, 2019, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details