ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MPTC, ZPTC Votes Counting: శావల్యాపురం జడ్పీటీసీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి గెలుపు - ZPTC ELECTION

MPTC ZPTC Votes Counting
కొనసాగుతున్న పరిషత్ ఓట్ల లెక్కింపు

By

Published : Nov 18, 2021, 3:31 PM IST

Updated : Nov 18, 2021, 4:18 PM IST

16:16 November 18

తెదేపా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ ఆధ్వర్యంలో నిరసన

  • శ్రీకాకుళం: తెదేపా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ ఆధ్వర్యంలో నిరసన 
  • హిరమండలం జడ్పీటీసీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి విజయం
  • 59 ఓట్ల మెజార్టీతో తెదేపా అభ్యర్థి బుచ్చిబాబు గెలుపు
  • బుచ్చిబాబు గెలిచినట్లు ప్రకటించిన ఎన్నికల అధికారులు
  • రీ కౌంటింగ్‌ నిర్వహించాలని వైకాపా పట్టు
  • గెలుపు ప్రకటించాక వైకాపా అభ్యంతరాన్ని తప్పుపట్టిన తెదేపా 
  • చెల్లని ఓట్లు రీ వెరిఫికేషన్ చేసున్న అధికారులు
  • మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ ఆధ్వర్యంలో నిరసన

15:30 November 18

  • గుంటూరు: శావల్యాపురం జడ్పీటీసీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి గెలుపు
  • వైకాపా అభ్యర్థిపై 1,046 ఓట్ల మెజార్టీతో హైమావతి విజయం

13:20 November 18

MPTC, ZPTC Votes Counting: కొనసాగుతున్న పరిషత్ ఓట్ల లెక్కింపు... అక్కడక్కడా ఆందోళనలు

రాష్ట్రంలో ఈనెల 16న జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్​ కొనసాగుతోంది. 10 జడ్పీటీసీ,123 ఎంపిటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈరోజు ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. 14 జడ్పీటీసీల్లో  4 ఏకగ్రీవంకాగా 10 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 176 ఎంపీటీసీల్లో 50 ఏకగ్రీవం కాగా, 3 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 123 ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 16న జరిగిన పోలింగ్‌ నిర్వహించారు.  

  • ప్రకాశం జిల్లా కారంచేడు ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు వద్ద వాగ్వాదం.
  • కారంచేడు-3 ఎంపీటీసీ లెక్కింపులో తెదేపా అభ్యర్థికి ఆధిక్యం లభించింది.
  • వైకాపాపై తెదేపా అభ్యర్థి 187 ఓట్లు ఆధిక్యం సాధించారు.
  • రీకౌంటింగ్‌ చేయాలని వైకాపా ఏజెంట్‌ వాగ్వాదానికి దిగారు.
  • వైకాపా ఏజెంట్‌ డిమాండ్‌తో అధికారులు రీకౌంటింగ్
  • 50 ఓట్లు లెక్కించిన తర్వాత వైకాపా ఏజెంట్లు రీకౌంటింగ్ అవసరం లేదనటంతో తెదేపా అభ్యర్థి గెలుపొందినట్లు ప్రకటన
  • నాగులుప్పలపాడు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద జనసేన ఆందోళన
  • ఎంపీటీసీ అభ్యర్థి 130కిపైగా ఓట్లతో గెలిచినా ప్రకటించట్లేదని ఆందోళన
  • వెంటనే గెలుపు ప్రకటించాలని  జనసేన నాయకుల డిమాండ్​
  • వైకాపా వర్గీయుల డిమాండ్‌తో  రీకౌంటింగ్‌

ఇదీ చదవండి :     

VIVEKA MURDER CASE: కొనసాగుతున్న విచారణ... కడపకు శివశంకర్‌రెడ్డి తరలింపు

Last Updated : Nov 18, 2021, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details