రాష్ట్రంలో ఈ నెల 8న 7,847 పరిషత్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. గత ఏడాది మార్చిలో 9,984 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, వివిధ కారణాలతో వీటిలో 288 చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు. మిగతా 9,696 స్థానాల్లో 2,371 ఏకగ్రీవమైనట్లు పంచాయతీరాజ్‌శాఖ ఎస్‌ఈసీకి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. కడప జిల్లాలో నాలుగుచోట్ల ఎన్నికలను బహిష్కరించారు. గతేడాది వ్యవధిలో నామినేషన్లు వేసిన అభ్యర్థుల్లో మృతి చెందినవారిని మినహాయించగా మిగిలిన వాటికి ప్రస్తుతం పోలింగ్ నిర్వహిస్తున్నారు. 660 జడ్పీటీసీ స్థానాల్లో 8 చోట్ల ఎన్నికలు నిర్వహించట్లేదు. మిగిలిన 652 స్థానాల్లో 126 ఏకగ్రీవమయ్యాయి.
*ఏకగ్రీవాల్లో కడప, చిత్తూరు జిల్లాలు అగ్రస్థానాల్లో నిలిచాయి. కడప జిల్లాలో 553 ఎంపీటీసీ స్థానాలకు 432 (78.11%); 50 జడ్పీటీసీ స్థానాలకు38 (76%) ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు జిల్లాలో 858 ఎంపీటీసీ స్థానాలకు 433 (50.46%); 65 జడ్పీటీసీ స్థానాల్లో 30 (46.15%) ఏకగ్రీవమైనట్లు అధికారులు వివరించారు.
ఎన్నికల నిర్వహణకు జిల్లాకో ప్రత్యేకాధికారి