Video viral: సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామ పరిధిలోని గీతం విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న దిలీప్, స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న పట్నం హైవే హోటల్లో భోజనం చేసేందుకు వెళ్లారు. అయితే అదే సమయంలో రుద్రారం గ్రామ ఎంపీటీసీ సోదరుడు నరసింహారెడ్డి అక్కడకు వచ్చి మద్యం మత్తులో హోటల్ నిర్వాహకుడిని దుర్భాషలాడుతున్నాడు. దీంతో ఎందుకు తిడుతున్నారు.. ఫుడ్ బాగోలేకపోతే మళ్లీ చేసి ఇస్తారు కదా అని నరసింహారెడ్డికి దిలీప్ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు.
Video viral: నేను ఎంపీటీసీ తమ్ముడిని.. నాకే సర్దిచెబుతావా..! - mptc brother narasimhareddy
Video viral: హోటల్ నిర్వాహకుడిని దుర్భాషలాడుతుండగా సర్ది చెప్పే ప్రయత్నం చేయడమే ఆ విద్యార్థి తప్పైంది. అతగాడు ఓ రాజకీయ నాయకుడి తమ్ముడని తెలియక దెబ్బలు తిన్నాడు. పైగా సదరు పొలిటికల్ బ్రదర్ ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్నాడు. ఇంకేముంది.. సర్దిచెప్పబోయిన స్టూడెంట్ను చావ బాదాడు ఆ లీడర్ తమ్ముడు. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ తతంగం అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.

attack
నేను ఎంపీటీసీ తమ్ముడిని.. నాకే సర్దిచెబుతావా..!
ఆగ్రహించిన నరసింహారెడ్డి నేను ఎంపీటీసీ సోదరుడిని.. నాకు చెప్పడానికి నువ్వు ఎవడవురా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడుతూ దాడికి దిగాడు. ఎందుకు కొడుతున్నారని అడుగుతున్నా వినిపించుకోకుండా మళ్లీ మళ్లీ దాడి చేశాడు. దిలీప్‌ను లాక్కెళ్లి తన కారులో ఎక్కించబోయాడు. ఈలోగా దిలీప్ వెంట ఉన్న స్నేహితుడు రంగారెడ్డి.. నరసింహారెడ్డికి సర్ది చెప్పి విడిపించాడు. ఈ వ్యవహారమంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఇవీ చదవండి: