ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతులెవరూ నష్టపోకుండా చూడాలి: సీఎం

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలోని ఆక్వా రైతులెవరూ నష్టపోకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. నిర్దేశించిన ధరలకే ఎగుమతిదారులు కొనుగోలు చేసేలా చూడాలని స్పష్టం చేశారు.

mpeda chairmen met cm jagan
mpeda chairmen met cm jagan

By

Published : Apr 4, 2020, 8:18 PM IST

కొవిడ్‌–19 కారణంగా తలెత్తిన పరిస్థితులను అనుకూలంగా తీసుకుని దళారులు రైతులను మోసం చేస్తే సహించబోమని ముఖ్యమంత్రి జగన్ తేల్చి చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎంపీఈడీఏ ఛైర్మన్ కె.ఎస్ శ్రీనివాస్ ముఖ్యమంత్రి జగన్​తో భేటీ అయ్యారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నష్టాలపై ఇరువురూ చర్చించారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నిరోధించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.ఎస్. శ్రీనివాస్​ను కోరారు. ఎగుమతిదారులకు ఈ విషయమై నోటీసులు కూడా జారీ చేసినట్టు శ్రీనివాస్ తెలిపారు. 6వ తేదీ నుంచి ఆక్వా సాగు చేసే ప్రాంతాల్లో సంబంధిత మంత్రి మోపిదేవి వెంకటరమణతో కలిసి పర్యటించాల్సిందిగా సీఎం సూచించారు.

ధరలు లేనప్పుడు రైతులు నేరుగా వాటిని కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వచేసుకునేలా ప్రాంతాల వారీగా స్టోరేజీలు ఏర్పాటు చేయడానికి, దీనికి సంబంధించిన ఆర్థిక సహాయం కేంద్రం నుంచి అందేలా చూడాలని సీఎం అన్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌ తరహాలోనే ఆక్వా జోన్లలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇనాం వ్యవస్థను తీసుకురావాలని స్పష్టం చేశారు. గడిచిన ఐదురోజుల్లో 2 వేల 832 మెట్రిక్‌ టన్నుల ఆక్వా ఉత్పతుల కొనుగోలు జరిగిందని, 2 వేల 70 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తుల ఎగుమతి అయినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 190 కరోనా పాజిటివ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details