ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

vijayasaireddy : పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి - Parlament committe member

పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి(vijayasaireddy) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతరులెవరూ పోటీలో లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ దేష్‌ దీపక్‌ వర్మ బులెటిన్ విడుదల చేశారు.

పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి
పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి

By

Published : Aug 10, 2021, 3:23 PM IST

పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) సభ్యుడిగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ దేష్‌ దీపక్‌ వర్మ బులెటిన్ విడుదల చేశారు. రాజ్యసభ నుంచి గతంలో పీఏసీ సభ్యులుగా ఉన్న భూపేందర్, రాజీవ్ చంద్రశేఖర్​లు కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి.

ఈ రెండు స్థానాలకు విజయసాయి, భాజపాకు చెందిన సుధాంశు త్రివేది నామినేషన్లు దాఖలు చేశారు. ఇతరులెవరూ పోటీలో లేని కారణంగా.. ఆ ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details