కేంద్ర బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి మొండిచెయ్యి చూపారని అసహనం వ్యక్తం చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల ప్రయోజనాలు తప్ప.. దేశంలో మిగిలిన రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు.
విశాఖ, విజయవాడకు మెట్రో ప్రస్తావనే లేదని.. పోలవరం ప్రస్తావనా రాలేదని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టు ఒక్కటీ లేదని నిరాశ వ్యక్తం చేశారు. కేంద్రం ప్రత్యేక హోదాపై భాజపా శ్రద్ధ పెట్టడం లేదన్నారు. అభివృద్ధి దిశ బడ్జెట్ కావాలి కానీ.. సర్వైవల్ బడ్జెట్ కాదని హితవు పలికారు. సామాజిక సంక్షేమ పథకాల్లో కేంద్ర బడ్జెట్‌లో పురోగతి లేదని విజయసాయిరెడ్డి ఆక్షేపించారు.