విశాఖ ప్రధాన కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను కేంద్రం ప్రకటించిందని.., 27 ఫిబ్రవరి 2019న ఈ ప్రకటన చేసినప్పటికీ... ఇప్పటి వరకూ ఎటువంటి కార్యకలాపాలు జరగలేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ ఏడాది దాటినా ఈ జోన్ ద్వారా కార్యకలాపాలు ప్రారంభమవలేదన్నారు. దేశంలోనే లాభదాయకమైన జోన్‌గా మారే అవకాశాలు దక్షిణకోస్తా రైల్వేకు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఈ జోన్ వార్షిక రాబడి అంచనా సుమారు రూ.13వేల కోట్లని, జోన్ కార్యకలాపాలు ప్రారంభమైతే రాష్ట్ర వాణిజ్యం, పరిశ్రమలు వేగవంతమవడమే కాక... రైల్వేశాఖకు సైతం లాభాలు చేకూరతాయన్నారు.
'దక్షిణ కోస్తా రైల్వే జోన్ పై కేంద్రం జోక్యం చేసుకోవాలి'
దక్షిణకోస్తా రైల్వేజోన్‌లో వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా కేంద్రం చర్యలు చేపట్టాలని రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. జోన్ ప్రకటన చేసి ఏడాది కావొస్తున్నా... ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదని అన్నారు.
mp vijaya sai