ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TG Venkatesh: రాజధానిగా అమరావతి ఓకే.. కానీ..

మూడు రాజధానుల అంశంపై రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ (mp tg venkatesh on capital city) కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిగా ఉన్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని..,కాకపోతే విశాఖ, కర్నూలులో సమ్మర్, వింటర్ రాజధానులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

mp tg venkatesh on three capitals
రాజధానిగా అమరావతి

By

Published : Nov 23, 2021, 8:55 PM IST

అమరావతి రాజధానిగా ఉన్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ (tg venkatesh on amaravti capital) అన్నారు. కాకపోతే.. విశాఖ, కర్నూలులో సమ్మర్, వింటర్ రాజధానులు ఏర్పాటు చేయాలని కోరారు. మూడు రాజధానుల అంశంపై కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన..ఒకసారి చట్టం చేసిన తర్వాత మార్పులు చేస్తే కోర్టుకు వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. చట్టంలో మార్పులు చేయకుండానే.. రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని టీజీ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ప్రజలు శ్రీశైలం ప్రాజెక్టు కోసం వేల ఎకరాలను త్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details