ఎంపీ విజయసాయిరెడ్డి చేసే నాసిరకం వ్యాఖ్యలు, ట్వీట్లపై తాను స్పందించనని భాజపా ఎంపీ సుజనా చౌదరి ఘాటు సమాధానమిచ్చారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేయలేదని స్పష్టం చేశారు. అలాంటిదేమైనా ఉంటే కేసులు పెట్టకోవచ్చని సవాల్ చేశారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రాన్ని ముంచే విధంగా ఉన్నాయి. ఆయన దిగజారి మాట్లాడుతున్నారు. అతను చేసే నాసిరకం ట్వీట్లకు స్పందించను. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేయలేదు. అలా జరిగిందని అనుమానముంటే కేసులు పెట్టుకోవచ్చు. 2013 తర్వాత అమరావతిలో రిజిస్ట్రేషన్ చేయలేదు. ఆ విధంగా జరిగితే విచారణ జరిపించాలి. అనైతికంగా ఎవరు ఏం చేసినా కేసులు పెట్టండి. వ్యాపారంలో లాభాలు, నష్టాలు సహజం. ఆర్థిక నేరాలు వేరు.. ఆర్థిక ఇబ్బందులు వేరు. నాకు ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు. వ్యాపారవేత్తగా అప్పులు ఇచ్చే వ్యక్తులు ఉంటే తీసుకుంటా. ఈ విషయంపై ఎలా వెళ్లాలో న్యాయవాదిని సంప్రదిస్తున్నాం. ఏపీలో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.. రాజధానిలో అన్ని పనులు ఆగిపోయాయి.