ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విభజన సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను భాజపా విస్మరించింది' - congress news

విభజన సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను భాజపా విస్మరించిందని... వాటికోసం కలిసి పోరాడదామని ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్​ పట్టభద్రుల ఎన్నికల్లో చిన్నారెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల వాణిని మండలిలో వినిపిస్తారని ఆయన కోరారు.

తెలంగాణ : 'విభజన సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను భాజపా విస్మరించింది'
తెలంగాణ : 'విభజన సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను భాజపా విస్మరించింది'

By

Published : Mar 5, 2021, 8:48 PM IST

తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్​ జిల్లాలోని కుత్బుల్లాపూర్​లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి హాజరయ్యారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ వాటిని నెరవేర్చడంలో సఫలం కాలేదని రేవంత్ ఆరోపించారు. తెలంగాణలో నీళ్లు ఏపీ సీఎం జగన్​కు, నియామకాలు ఆయన కుటుంబానికి, నిధులన్నీ ఆయన బంధువులకు ఇచ్చారని వ్యాఖ్యానించారు.

పునర్‌విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను రాబట్టేందుకు తెరాస కలిసి రావాలని కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జంతర్‌మంతర్‌ వద్ద దీక్షకు దిగుదామని మంత్రి కేటీఆర్​కు సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు హామీలు ఇస్తే.. భాజపా విస్మరించినా పోరాడేందుకు తెరాస భయపడుతోందని రేవంత్‌ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ పట్టభద్రుల ఎన్నికల్లో చిన్నారెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల వాణిని మండలిలో వినిపిస్తారని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details