ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా సామాజిక వ్యాప్తి మొదలైంది.. చర్యలు తీసుకోండి: ఎంపీ రామ్మోహన్​ - సీఎంకు రామ్మోహన్ నాయుడు లేఖ

రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి మొదలై కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని.. నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎంకు లేఖ రాశారు శ్రీకాకుళం జిల్లా ఎంపీ రామ్మోహన్​ నాయుడు. అన్ని జిల్లాల్లో అత్యవసరంగా ప్లాస్మా బ్యాంకులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. క్వారంటైన్​ కేంద్రాల్లో ఉన్న సమస్యలను ఆయన లేఖలో వివరించారు.

mp rammohan naidu letter to cm jagan
సీఎం జగన్​కు ఎంపీ రామ్మోహన్​ నాయుడు లేఖ

By

Published : Jul 23, 2020, 4:47 PM IST

సీఎం జగన్​కు ఎంపీ రామ్మోహన్​ నాయుడు లేఖ

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన శ్రీకాకుళం జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడు... నివారణ చర్యలు చేపట్టాలని సీఎం జగన్​కు లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితిలో రోగులకు మెరుగైన చికిత్స అందించాలంటే జిల్లాల్లో ప్లాస్మా బ్యాంకులు ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లడ్​ బ్యాంకుల్లోనే వీటిని ఏర్పాటు చేస్తే చికిత్స అందించేందుకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.

క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎంపీ లేఖలో పేర్కొన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాలు సరిగ్గా లేక చాలా మంది మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

సామాజిక వ్యాప్తితో రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొవిడ్ -19 ద్వారా తీవ్రంగా ప్రభావితమైన రోగులకు ప్లాస్మా చికిత్స ఉపశమనం కలిగిస్తోంది. కోవిడ్ డీసిగెంటెడ్ ప్లాస్మా బ్యాంకుల ఆవశ్యకతపై చాలా మంది మాట్లాడుకుంటున్నారు. వీటిని ఏర్పాటు చేయాలని చాలా మంది నన్ను అభ్యర్థించారు. బ్లడ్ బ్యాంకుల రూపంలో మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి. అదనంగా ప్లాస్మా, ప్లేట్‌లెట్లు సేకరించే పద్ధతి ఇప్పటికే ఉంది. ఈ బ్యాంకుల్లో కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు నియంత్రణలో ఉన్నాయి. వీటిని కొవిడ్ సెంట్రిక్ ప్లాస్మా బ్యాంకులుగా మార్చాలి. ఇప్పటి వరకు కోలుకున్నవారి ప్లాస్మాతో 22వేలకుపైగా బాధితులకు చికిత్స అందించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కరోనా హాట్‌స్పాట్‌లు వెలుగు చూస్తున్నాయి. రికవరీ రేటు తక్కువగానే ఉంది. ఇలాంటి పరిస్థితిలో మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటాన్ని మెరుగుపరచడంలో జిల్లాల్లో ప్లాస్మా బ్యాంకుల ఏర్పాటు ఉపయోగకరంగా ఉంటుంది.

- ఎంపీ రామ్మోహన్​ నాయుడు

ఇదీ చదవండి:

రాజధాని బిల్లుల వ్యవహారంపై వివరాలు కోరిన పీఎంఓ

ABOUT THE AUTHOR

...view details