ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బాబాయ్ కోసం ప్రార్థించిన అందరికి కృతజ్ఞతలు: రామ్మోహన్ నాయుడు - అచ్చెన్నాయుడికి బెయిల్​ మంజూరవ్వటంపై రామ్మోహన్ నాయుడు ఆనందం

తన బాబాయ్​ అచ్చెన్నాయుడికి బెయిల్​ మంజూరవ్వటంపై ఎంపీ రామ్మోహన్​ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. రాజ‌కీయ వేధింపుల‌తో ఆయనపై పెట్టిన కేసుల నుంచి ప్రజలంద‌రి ఆశీస్సుల‌తో బ‌య‌ట‌కొస్తున్నారన్నారు.

mp rammohan naidu feels happy for achennaidu getting bail
బాబాయ్ కోసం ప్రార్థించిన అందరికి కృతజ్ఞతలు: రామ్మోహన్ నాయుడు

By

Published : Aug 28, 2020, 1:58 PM IST

Updated : Aug 29, 2020, 3:14 AM IST

రామ్మోహన్ నాయుడు

ఈఎస్​ఐ వ్యవహారంలో అరెస్టైన అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరవ్వటంపై తెదేపా ఎంపీ కింజరపు రామ్మోహన్​ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. అభిమానుల ప్రార్థన‌లు ఫ‌లించాయన్నారు. స్వచ్ఛమైన రాజ‌కీయ జీవితంలో మ‌చ్చలేని ఆయన... రాజ‌కీయ వేధింపుల‌తో పెట్టిన కేసుల నుంచి ప్రజలంద‌రి ఆశీస్సుల‌తో బ‌య‌ట‌కొస్తున్నారన్నారు.

"బెయిల్ మంజూరైనా... బాబాయ్​కి క‌రోనా పాజిటివ్​గా నిర్ధర‌ణ కావ‌డంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అభిమానులెవ్వరు పరామ‌ర్శకు రావొద్దు. కార్యకర్తలు, ప్రజల అభిమాన‌మే తమకు కొండంత అండ‌, బాబాయ్ కోసం ప్రార్థించిన అందరికి కింజ‌రాపు కుటుంబం త‌ర‌ఫున పేరుపేరునా కృత‌జ్ఞత‌లు. ఈ క‌ష్టకాలంలో తమ కుటుంబానికి అండ‌గా నిలిచిన తెదేపా అధినేత చంద్రబాబు, కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా".

-తెదేపా ఎంపీ రామ్మెహన్ నాయుడు

ఇదీ చదవండి:

సీఎం చేతుల మీదుగా వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన

Last Updated : Aug 29, 2020, 3:14 AM IST

ABOUT THE AUTHOR

...view details