పెట్టుబడుల కోసం అన్ని రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తుంటే.. రాష్ట్రం పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉందని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. లోక్‌సభలో మాట్లాడిన ఆయన..గత ప్రభుత్వం విశాఖలో మిలీనియం టవర్ నిర్మాణం చేపట్టి వేల మందికి ఐటీలో ఉపాధి కల్పిస్తే ఇప్పుడు వారిని ప్రస్తుత ప్రభుత్వం వెల్లగొడుతోందని ఆరోపించారు. ఇదే తరహాలో కియా పరిశ్రమ తరలిపోయేందుకు సిద్ధమవుతోందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. కియా తరలిపోతుందన్న కథనాలను వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి ఖండించారు.
లోక్‌సభలో తెదేపా, వైకాపా ఎంపీల మాటల యుద్ధం - పార్లమెంటులో ఎంపీ రామ్మోహన్ నాయుడు వార్తలు
రాష్ట్రంలో పరిశ్రమలు తరలిపోతున్నాయని లోక్ సభలో తెదేపా ఎంపీ రామ్మెహన్ నాయుడు ఆరోపించగా... అలాంటిదేమీ లేదని వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి ఖండించారు.
mp rammohan naidu comments on kia on parlament