ముఖ్యమంత్రి జగన్.. తడిగుడ్డతో అమరావతి రైతుల గొంతుకోసిన పాపంలో తాను భాగస్వామినైనందుకు సిగ్గుపడుతున్నానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. చేసిన తప్పుకు క్షమాపణగా రాజధాని ఉద్యమానికి మద్దతు పలికానని స్పష్టంచేశారు. తాను తన తప్పు తెలుసుకున్నట్లే ముఖ్యమంత్రి కూడా తన తప్పు తెలుసుకోవాలని హితవు పలికారు.
ఆలస్యమైనా న్యాయం జరుగుతుందనే ఆశతో అమరావతి రైతులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విప్లవ కవి శ్రీశ్రీ జన్మదినం సందర్భంగా ఆయన స్ఫూర్తితో ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకుపోదామని రైతులకు పిలుపునిచ్చారు.