తనను వ్యక్తిగతంగా దూషించిన ఐఅండ్‌పీఆర్‌లో చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేంద్రరెడ్డి అనే ప్రభుత్వ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులానికి, ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణ రాజు విజ్ఞప్తి చేశారు. 48 గంటల లోపు ఆయనపై చర్యలు తీసుకోని ఎడల ఆయనపై పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.
' 48 గంటల్లో ఆయనపై చర్యలు తీసుకోకపోయారో!' - ఐఅండ్‌పీఆర్‌లో చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేంద్రరెడ్డి తాజా వార్తలు
సామాజిక మాధ్యమాల్లో తనపై వ్యక్తిగతంగా దూషించిన గుర్రంపాటి దేవేంద్రరెడ్డిపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
దేవేంద్రరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎంపీ డిమాండ్
Last Updated : Aug 13, 2020, 5:26 PM IST