ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Raghurama letter: 'నాపై ఎంపీ విజయసాయి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు' - ఏంపీ రఘురామ తాజా లేఖ

తనపై.. ఎంపీ విజయసాయిరెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. క్విడ్‌ప్రోకో, సూట్‌ కేసు కంపెనీల బాగోతాన్ని వివరిస్తూ.. రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసినట్లు రఘురామ తెలిపారు.

MP raghuramarakrishnaraju Letters
ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

By

Published : Jul 26, 2021, 3:25 PM IST

ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌లో తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తాను విదేశాలకు వెళ్లకుండా చూడాలంటున్నారని.. 20 కేసులున్న విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లొచ్చా? అని ప్రశ్నించారు. ఈ మేరకు దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏ-1 చేపట్టిన పనులపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. ఏ-2 స్థాపించిన సూట్‌ కేసు కంపెనీలతో ఏ-1 కార్యకలాపాలు జరిగాయన్నారు.

క్విడ్‌ప్రోకో, సూట్‌ కేసు కంపెనీల బాగోతాన్ని లేఖలో వివరించినట్లు రఘురామ చెప్పారు. జగన్‌, విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details