MP RAGHURAMARAJU: పీఆర్సీపై ఉద్యోగుల ఆందోళనలకు మద్దతుగా....వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దీక్ష చేపట్టారు. దిల్లీలోని నివాసంలో ఉపవాస దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఎంపీ రఘురామ ఉపవాస దీక్ష కొనసాగనుంది. ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఎంపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పీఆర్‌సీ జీవోలను వెనక్కి తీసుకోవాలిన డిమాండ్ చేశారు. ఉద్యోగుల హామీలు నెరవేర్చడం కంటే ప్రజలకు తాయిలాలు పంచి ఓట్లు కొనుగోలు చేయడమే...ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతోందని..ఆయన ఆరోపించారు. అందుకనే ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నా....సర్కార్ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఐఆర్ కంటే పీఆర్సీ తక్కువ చరత్రలో ఎప్పుడూ లేదన్న రఘురామ రివర్స్ పీఆర్సీపై జీవోలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, గురువులకు మన వంతు సాయం చేద్ధామని ఈమేరకు ఆయన కోరారు.
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఎంపీ రఘురామ లేఖ...