ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుంటూరు అర్బన్‌ ఎస్పీకి కోర్టు ధిక్కరణ నోటీసు పంపిన రఘురామ న్యాయవాది - MP Raghuram krishnaraju latest news

ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించారంటూ ఆయన తరఫు న్యాయవాది కె.దుర్గాప్రసాద్‌.. గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డికి సోమవారం కోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేశారు.

MP Raghuram issue
ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌ వ్యవహారం

By

Published : May 25, 2021, 8:36 AM IST

ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించారంటూ ఆయన తరపు న్యాయవాది కె.దుర్గాప్రసాద్..గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డికి సోమవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేశారు. ఎస్పీ వాట్సాప్ నెంబర్‌కు ఆ నోటీసు పంపించారు. 'సికింద్రాబాద్​లోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘురామకృష్ణరాజు అక్కడి నుంచి డిశ్చార్జ్ అయితే, ఆయన్ను బెయిల్​పై విడుదలైనట్లేనని, సంబంధిత బాండ్లు, పూచీకత్తుల్ని ఆ తర్వాత పది రోజుల్లోగా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు విరుద్ధంగా బెయిల్ బాండ్లు పొందేందుకు ఆయన్ను సైనిక ఆసుపత్రి నుంచి గుంటూరుకు తీసుకురావాలంటూ మీరు ఆయన ఎస్కార్ట్ సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది. ఇది సుప్రీంకోర్టు ఆదేశాల్ని ధిక్కరించటమే. అందుకే ఈ నోటీసు జారీ చేస్తున్నాం.' అని న్యాయవాది దుర్గాప్రసాద్ అందులో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details