ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు కోసం..కేంద్రానికి సిఫార్సు చేయాలని సీఎం జగన్ని ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. సినీ రంగంలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేసిన ఎన్టీఆర్....భారతరత్న అవార్డుకు అన్ని విధాలా అర్హుడని పేర్కొన్నారు. భారత రత్న అవార్డుకు రాష్ట్రం తరఫున ఎన్టీఆర్ పేరు సూచించాలని సీఎం జగన్‌కు....ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.
సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ - ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా సమాచారం
సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు కోసం కేంద్రానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు.
![సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ mp raghuramakrishnaraju wrote a letter to cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10287391-250-10287391-1610970926740.jpg)
సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ