సామాజిక మాధ్యమాల్లో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు పెడుతున్నారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఐఅండ్‌పీఆర్‌లో చీఫ్ డిజిటల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న దేవేందర్‌రెడ్డిపై ఆయన ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. తక్షణమే విచారణ జరిపి దేవేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. జాప్యం చేస్తే పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
'సోషల్ మీడియాలో నాపై అభ్యంతరకర పోస్టులు పెటుతున్నారు.. చర్యలు తీస్కోండి' - సీఎస్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ
సీఎస్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఐఅండ్‌పీఆర్‌లో చీఫ్ డిజిటల్ డైరెక్టర్ దేవేందర్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపీపై పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
mp raghuramakrishnaraju