ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MP Raghurama: ట్రూఅప్‌ అంటే అసమర్థుడి పన్ను: రఘురామకృష్ణరాజు - వైకాపాపై ఎంపీ రఘురామ మండిపాటు

MP Raghurama:సర్దుబాటు (ట్రూఅప్‌) అంటే అది అసమర్థుడి పన్ను అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. మూడేళ్ల కాలంలోనే 7 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచిన వారిని చిన్న మనుషులు అనాలా.. చేతగానివారు అనాలా? అని ఆయన ప్రశ్నించారు.

MP Raghurama fires on ysrcp over increasing current charges
ట్రూఅప్‌ అంటే అసమర్థుడి పన్ను: రఘురామకృష్ణరాజు

By

Published : Apr 1, 2022, 8:12 AM IST

MP Raghurama: సర్దుబాటు (ట్రూఅప్‌) అంటే అది అసమర్థుడి పన్ను అని.. ప్రభువుల చేతగానితనాన్ని సర్దుబాటు చేసుకునేందుకు వేసిన పన్ను అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. చంద్రబాబు తన అయిదేళ్ల పదవీ కాలంలో 3 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచితే.. పెద్ద మనిషి అని.. ఇంకా ఏదో అని నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి అన్నారని ఆయన గుర్తు చేశారు. మూడేళ్ల కాలంలోనే 7 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచిన వారిని చిన్న మనుషులు అనాలా.. చేతగానివారు అనాలా? అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ ఛార్జీలను కొద్దిగా పెంచితేనే ముఖ్యమంత్రిపై ప్రజలు తిరగబడాలని జగన్‌ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు భారీగా వడ్డిస్తుండటంతో ప్రజలు ఏం చేయాలని ప్రశ్నించారు. ఇప్పటికే కరెంటు కోతలు విధిస్తున్నారని.. ఈ కోతలను జగన్‌ ఉగాది దీవెన.. కానుక అనుకోవాలా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details