కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఎంపీ రఘురామకృష్ణరాజు సమావేశం అయ్యారు. షోకాజ్ నోటీసు, అనర్హత వేటు వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే తనకు భద్రత కల్పించాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిన రఘురామకృష్ణరాజు...శుక్రవారం నేరుగా స్పీకర్‌ను కలిశారు. అదే విధంగా వైకాపా జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంబంధించి కేంద్రం ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో భేటీ
దిల్లీ పర్యటనలో ఉన్న రఘురామకృష్ణరాజు.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిని కూడా కలిశారు. తన భద్రత విషయంపై కిషన్‌రెడ్డితో చర్చించారు. స్పీకర్ కార్యాలయం హోంశాఖకు పంపిందన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విషయాలు తెలుసుకుని... పరిశీలిస్తానని కేంద్రమంత్రి చెప్పారు.
హోంశాఖ కార్యదర్శితో భేటీ
హోంశాఖ కేంద్రమంత్రులను కలిసిన ఎంపీ రఘురామకృష్ణరాజు.. అనంతరం హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాని కలిశారు. తన భద్రతకు సంబంధించిన విషయంపై చర్చించారు.
ఇదీ చదవండి:
ఈ తరహా కేసు తొలిసారి చూస్తున్నాం.. ఎంపీకి ఈసీ వెల్లడి