ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MP RAGHURAMA PETITION: జగన్ బెయిల్ రద్దు కోరుతూ.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ - ఎంపీ రఘురామ తాజా వార్తలు

MP Raghurama files petition on cancellation of Jagan's bail
ఎంపీ రఘురామ పిటిషన్

By

Published : Oct 6, 2021, 4:14 PM IST

Updated : Oct 6, 2021, 5:38 PM IST

16:11 October 06

తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్

అక్రమాస్తుల కేసులో.. ముఖ్యమంత్రి జగన్​ బెయిల్ రద్దు అంశం తెలంగాణ హైకోర్టు(cm Jagan bail updates)కు చేరింది. వైఎస్ జగన్​తోపాటు ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. హైకోర్టులో వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్(MP Raghurama petition on cancellation of Jagan bail ) దాఖలు చేశారు. బెయిల్ రద్దు చేయాలన్న రాఘురామ పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ.. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రఘురామ పిటిషన్లు హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నాయి. సీబీఐ కోర్టు విధించిన షరతులు ఉల్లంఘించినందున జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామ ప్రధాన అభ్యర్థన.  

రఘురామ పిటిషన్లను కొట్టేసిన సీబీఐ కోర్టు
జగన్, విజయసాయిరెడ్డి సాక్షులను ప్రలోభ పెడుతున్నారని, విచారణ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని సీబీఐ కోర్టులో రఘురామ వాదించారు. అయితే తాము ఎలాంటి షరతులు ఉల్లంఘించలేదని.. వ్యక్తిగత ప్రచారం, రాజకీయ ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్లు దాఖలు చేశారని జగన్, విజయ్ సాయిరెడ్డి సీబీఐ కోర్టులో వాదించారు. సీబీఐ మాత్రం ఏమీ వాదించకుండా.. పిటిషన్లలోని అంశాలపై చట్టప్రకారం విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. సుదీర్ఘ వాదనల అనంతరం.. రఘురామ పిటిషన్లను సీబీఐ కోర్డు కొట్టేసింది. అయితే సీబీఐ కోర్టు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదంటూ.. తెలంగాణ హైకోర్టులో రఘరామ పిటిషన్ దాఖలు(MP Raghurama petition in Telangana High Court) చేశారు.

ఇదీ చదవండి :      

TIRUMALA TIRUPATHI BRAHMOTHSAVALU: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేటి సాయంత్రమే అంకురార్పణ

Last Updated : Oct 6, 2021, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details