ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RRR: 'వేదాంత సంస్థకు ఖనిజం అమ్మినట్లు రికార్డుల్లో ఉంది' - mp raghurama updates

వేదాంత సంస్థకు ఖనిజం అమ్మినట్లు రికార్డుల్లో ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మట్టి తవ్వకాల విషయమై అధికారులు తనిఖీ చేశారని తెలిపారు. ఏ ప్రయోజనం కోసం తవ్వకాలు చేస్తున్నారో చెప్పట్లేదన్నారు.

MP Raghurama
ఎంపీ రఘురామ

By

Published : Aug 19, 2021, 2:43 PM IST

వేదాంత సంస్థకు ఖనిజం అమ్మినట్లు రికార్డుల్లో ఉందని ఎంపీ రఘురామ అన్నారు. అల్యూమినియం కోసం సంస్థ 33 టన్నులు తీసుకుందన్నారు. మట్టి తవ్వకాల విషయమై అధికారులు తనిఖీ చేశారని రఘురామ తెలిపారు. ఏ ప్రయోజనం కోసం తవ్వకాలు చేస్తున్నారో చెప్పట్లేదన్నారు. లేటరైట్ తవ్వకాల కోసం 40 అడుగులు రోడ్డు వేశారని ఆరోపించారు. నడవటానికి ఇంత పెద్ద రోడ్లు అవసరమా? అని అధికారులు ప్రశ్నించారని ఎంపీ తెలిపారు. బాక్సైట్ కోసం ఖనిజం అమ్మితే అదే రికార్డుల్లో తెలపాలన్నారు.

ఇదీ చదవండి: గన్నవరం విమానాశ్రయానికి కిషన్​రెడ్డి.. భాజపా శ్రేణుల ఘన స్వాగతం

ABOUT THE AUTHOR

...view details