MP Raghurama on CM Jagan: ప్రమాణస్వీకారం అనంతరం కొత్త మంత్రులు.. సీఎం జగన్ కాళ్ల మీద పడటంపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. కొత్త మంత్రులు సీఎం కాళ్లపై పడటం సరిగాలేదని అన్నారు. సీఎం కంటే వయసులో చిన్నవాళ్లు పాదాభివందనం చేసినా పర్వాలేదు కానీ.. పెద్దవాళ్లు కూడా కాళ్లపై పడటం విడ్డూరంగా ఉందన్నారు. తనను తిట్టినందుకే శ్రీకాకుళం ఎమ్మెల్యే ప్రసాదరాజుకు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.. కానీ వారికి అధికారం ఇచ్చారా? అని ప్రశ్నించారు.
'వైకాపాలో మంత్రి పదవులు రానివారు చాలా బాధపడ్డారు. మూడు సామాజిక వర్గాలతో జగన్ విభేదిస్తున్నారు. జంధ్యం వేసుకునే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ముగ్గురికీ మంత్రివర్గంలో స్థానం లేకుండా చేశారు. నిన్న తిరుపతిలో జరిగిన ఘటన దారుణం. భగవంతుడిని భక్తుడికి దూరం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో తితిదే ఈవోను నియమించాలి. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సీబీఎన్‌కు దత్తపుత్రుడు అని సీఎం జగన్ మాట్లాడారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా..?. దానిపై పవన్ ఊరుకుంటారా.. సీబీఐకి దత్తపుత్రుడు అంటానన్నారు. తెదేపాకు బీ టీమ్ అన్నారు.. చర్లపల్లి షటిల్ టీమ్ అంటానన్నారు. అయితే.. చర్లపల్లి బదులు చంచల్‌గూడ అనాలని పవన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను' అని ఏంపీ రఘురామ వ్యాఖ్యానించారు.