ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ ముగిసింది. ఆంగ్ల మాధ్యమం గురించి చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణ రాజు ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు. వైకాపా ఎంపీలు పార్టీ గీతదాటి వ్యవహరించరని రఘురామకృష్ణ రాజు స్పష్టం చేశారు.
'మోదీ పలకరించడం యాద్ధృచ్చికంగా జరిగిందే' - mp raghurama krishna meets cm jagan news
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ ముగిసింది. పార్లమెంటులో ఎంపీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
!['మోదీ పలకరించడం యాద్ధృచ్చికంగా జరిగిందే'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5144421-781-5144421-1574428170390.jpg)
mp raghurama krishna meets cm jagan
మోదీ సీఎంగా ఉన్నప్పటినుంచీ నేను ఆయనకు తెలుసు. పార్లమెంటులో నన్ను మోదీ పలకరించడం యాద్ధృచ్చికంగా జరిగిందే. నియోజకవర్గ సమస్యల గురించే కేంద్రమంత్రులతో మాట్లాడా. తెలుగుపై నేను మాట్లాడిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లా. రాజకీయంగా ఏవేవో ఊహించుకుని ప్రచారం చేయడం తగదు
- ఎంపీ రఘురామకృష్ణరాజు
Last Updated : Nov 22, 2019, 7:43 PM IST