ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RRR: '20వ తేదీ వచ్చినా.. 20 శాతం మందికి జీతాలు చెల్లించలేదు' - mp raghurama krishnaraju latest news

రాష్ట్రం ఆర్థికంగా బాగా దెబ్బతింటోందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. 20వ తేదీ వచ్చినా.. 20 శాతం మందికి కూడా వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని కలెక్టర్లకు చెప్పారని.. ఆదాయం మార్గాలు పెంచడానికి కలెక్టర్లకు ఏం సంబంధం అని ప్రశ్నించారు.

MP Raghurama
ఎంపీ రఘురామ

By

Published : Aug 20, 2021, 1:58 PM IST

ఆర్థికంగా రాష్ట్రం బాగా దెబ్బతింటోందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్​ను కూడా రద్దు చేయలేదని.. చివరికి ఉద్యోగులు పీఎఫ్ డబ్బులో కూడా కోత విధిస్తున్నారన్నారు. 20వ తేదీ వచ్చినా ఇంకా 20 శాతం మందికి కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు.

మా జగనన్న ప్రభుత్వం వచ్చాక రూ.2.56 లక్షల కోట్లు అప్పు చేశారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు తెస్తున్నారు. ఉద్యోగులు జీతాలు, పింఛన్లకే ఆదాయం సరిపోతోంది. ఎడాపెడా అప్పులు తెచ్చి పప్పుబెల్లాలు పంచుతున్నారు. సంక్షేమం అవసరమే.. కానీ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేలా ఉండకూడదు. ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని కలెక్టర్లకు చెప్పారని తెలిసింది. ఆదాయం మార్గాలు పెంచడానికి కలెక్టర్లకు ఏం సంబంధం?. సీఎంను కలిసే పరిస్థితులు కూడా లేవు. సీఎం వస్తేనే సచివాలయానికి మంత్రులు వస్తున్నారు. సీఎం జగన్ సచివాలయంలో అందుబాటులో ఉండాలని కోరుతున్నా. మరో పాతికేళ్లు మా పార్టీ అధికారంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నా. : రఘురామకృష్ణరాజు, ఎంపీ

ఇదీ చదవండి

GORANTLA: బుచ్చయ్య చౌదరిని బుజ్జగించే పనిలో తెదేపా అధిష్ఠానం

ABOUT THE AUTHOR

...view details