MP RRR ON NTR HEALTH VERSITY : ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పును.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు. ఏ మాత్రం సంబంధం లేని వైఎస్సార్పేరును వర్సిటీకి పెట్టడం పద్ధతి కాదన్నారు. ఇలాంటి పోకడలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 17 వైద్యకళాశాలలు కడుతున్నట్లు ప్రభుత్వం ఫోజులు కొడుతున్నా.. వాస్తవానికి కేంద్రం కేటాయించింది మూడేనని గుర్తు చేశారు. ప్రజాపాలన మరిచిపోయి.. పేర్ల పిచ్చితో వ్యవహరిస్తే ఉపయోగం ఏంటని రఘురామ ప్రశ్నించారు.
MP RRR: ఎన్టీఆర్ యూనివర్సిటీకి.. వైఎస్సార్‌కు సంబంధమేంటి?: రఘురామ - ఎంపీ రఘురామకృష్ణరాజు
MP RRR : ఎన్టీఆర్ వర్సిటీకి, వైఎస్సార్‌కి సంబంధం ఏంటని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. వైఎస్సార్‌కు సంబంధం లేని సంస్థలకు ఆయన పేరు పెట్టడమేంటని మండిపడ్డారు.
MP RRR ON NTR HEALTH VERSITY
గత ప్రభుత్వంలో చంద్రబాబు ఏ సంస్థకు తన పేరు పెట్టుకోలేదు. ఎన్టీఆర్ యూనివర్సిటీకి, వైఎస్సార్‌కు సంబంధమేంటి? సీఎం అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడటం సమంజసమా? వైఎస్సార్‌కు సంబంధం లేని సంస్థలకు ఆయన పేరు పెట్టడమేంటి? జగన్ ఆయన తండ్రి గురించి ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు. ఇన్ని పథకాలకు మీ పేర్లు ఉన్నాయిగా ఇంకా ఇవన్నీ ఎందుకు.-ఎంపీ రఘురామకృష్ణరాజు
ఇవీ చదవండి: