ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్‌కి ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఎంపీ రఘురామ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. డెయిరీ ఆస్తులను అమూల్ సంస్థకు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుని ఈ నెల 19న జీవో 117 ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ కో ఆపరేటివ్ లిమిటెడ్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధం అని పిటిషనర్ తెలిపారు.
జీవో సవాలు చేస్తూ పిటిషన్ వేశారా.. అని పిటిషనర్‌ని హైకోర్టు ప్రశ్నించగా.. పిటిషన్ వేసేటప్పటికి జీవో ఇవ్వలేదని బదులిచ్చారు. జీవో సవాలు చేస్తూ అనుబంధ పిటీషిన్ వేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి హైకోర్టు విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది.