నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల వాయిదా పడింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న రఘురామ ఆరోగ్య పరిస్థితిని గుంటూరు జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి సమ్మరీని కోరారు. ఈ క్రమంలో ఎంపీకి మరో నాలుగు రోజులు వైద్యం అవసరమని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు మేజిస్ట్రేట్‌కు తెలిపారు. దీంతో వైద్యులు తుది నివేదిక ఇచ్చిన తర్వాతే రఘురామ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ నెల 21న సుప్రీంకోర్టు ఎంపీకి బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. గుంటూరులోని ట్రయల్ కోర్టులో కేసు నడుస్తుండటంతో పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండటం వల్ల ఎంపీ విడుదలకు ఈ ప్రక్రియ జరగాల్సి ఉంది.