వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదు చేసిన కేసుల్లో ఈనెల 22 వరకు అరెస్ట్‌తో పాటు ఇతర తొందరపాటు చర్యలొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని అందిన ఫిర్యాదు ఆధారంగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్ గ్రామీణ ఠాణాతో పాటు వివిధ పోలీసు స్టేషన్లలో ఎంపీపై కేసులు నమోదు అయ్యాయి.
రఘురామకృష్ణరాజును అరెస్టు చేయొద్దు : హైకోర్టు
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుపై దాఖలైన ఎఫ్ఐఆర్‌లు కొట్టేయాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రఘురామకృష్ణరాజును అరెస్టు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
రఘురామకృష్ణరాజును అరెస్టు చేయొద్దు : హైకోర్టు
ఆ కేసుల్ని కొట్టేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణ రాజు హైకోర్టును ఆశ్రయించారు. సీనియర్ న్యాయవాది ఎస్ఎన్ ప్రసాద్ స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాల్లో పోలీసుల తరఫున తాను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియామకం కానున్నానని, త్వరలో జీవో విడుదల కానుందని కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
ఇదీ చదవండి:శాసనసభ్యులు, అసెంబ్లీ ఉద్యోగులకు కరోనా వ్యాక్సినేషన్