ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పరిషత్ ఎన్నికలు తెదేపా బహిష్కరించటం సరైన నిర్ణయమే: రఘురామ

పరిషత్ ఎన్నికలను తెదేపా బహిష్కరించటం సరైన నిర్ణయమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేఖిస్తూ నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కుగా ఆయన పేర్కొన్నారు.

mp raghuram krishnaraju
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

By

Published : Apr 3, 2021, 8:24 PM IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఇచ్చారన్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు...కనీసం నాలుగు వారాలు సమయం ఉండాలన్న విషయం కూడా తెలియకుండా ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు ఎన్నికలను బహష్కరించాలని తెదేపా తీసుకున్న నిర్ణయం సరియైనదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేఖిస్తూ నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కుగా పేర్కొన్నారు.

తనపై చేసిన ఫిర్యాదులో కనీసం సంతకం కూడా లేదని ఆరోపించారు. కొంత డబ్బు కూడా సమకూర్చారని తనకు సమాచారం ఉందని విమర్శించారు. తమ సీఎం.. ఇద్దరు ఎంపీల సహకారంతో ఎస్​బీఐ ఎండీ శ్రీనివాసుల శెట్టి, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఎండీ మల్లిఖార్జునరావులపై ఒత్తిడి తెచ్చి ఫిర్యాదు చేయించారని ధ్వజమెత్తారు. గుడ్‌ఫ్రైడే రోజున కూడా తమ సీఎం కొద్దిమంది బ్యాంకర్లతో, సీబీఐ అధికారులతో సమావేశమై...తమ కేసుపై మాట్లాడినట్లు తనకు దిల్లీ నుంచి సమాచారం ఉందని పేర్కొన్నారు.

వివేకా కేసులో సాక్షులు ఉండరేమో..!

వైఎస్ వివేకా హత్యకేసులో సాక్షులు లేకుండా పోతారేమోనని...ఆయన కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా సీబీఐ విచారణ డిమాండ్‌ చేసిన జగన్.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు అని రఘురామ ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడి హత్య ఘటనలో నిందితులెవరో తేల్చకపోవడం ఏమిటని నిలదీశారు. ఈ కేసు రెండు సంవత్సరాలుగా జాప్యం జరుగుతోందని..అందుబాటులో ఉన్న సాక్షులు లేకుండాపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పార్టీకి చెడ్డపేరు తెస్తుందన్న విషయాన్ని పార్టీ అధిష్ఠానం గుర్తెరగాలని సూచించారు.

ఇదీ చదవండి:

తిరుపతి ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తే.. ప్రయోజనం లేదు: రఘునందన్​రావు

ABOUT THE AUTHOR

...view details