ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సలహాలు, సూచనల కోసమే కేంద్రమంత్రిని కలిశా: రఘురామకృష్ణరాజు - కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ రఘురామకృష్ణ రాజు

సరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ను కలిశారు. తితిదే భూముల విషయం, ఇసుక విధానంలో విషయంలో సూచనలు చేశానని తెలిపారు. సాండ్ కార్పొరేషన్ ఏర్పాటైందంటే తప్పు జరుగుతుందనేగా అర్థం అని వ్యాఖ్యానించారు.

mp-raghuram-krishna
mp-raghuram-krishna

By

Published : Jul 16, 2020, 3:54 PM IST

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ను ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నందున సలహాలు, సూచనలు ఇవ్వడం కోసమే కలిశానని చెప్పారు. తాను వేరే ఏ పార్టీలో చేరట్లేదని.. ఎంపీగా మాత్రమే కేంద్ర మంత్రులను కలుస్తున్నానని స్పష్టం చేశారు.

తితిదే భూముల వివాదం, ఇసుక విధానం విషయంలో కేంద్రానికి కీలక సూచనలు చేశానని తెలిపారు. సాండ్ కార్పొరేషన్ ఏర్పాటైందంటే తప్పు జరుగుతుందనేగా అర్థం అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. తనపై ఎందుకు అనర్హత ఫిర్యాదు చేశారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details