ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RRR: కస్టోడియల్‌ టార్చర్‌ పిటిషన్​పై త్వరగా విచారణ జరపండి: సుప్రీంకు రఘురామ విజ్ఞప్తి - కస్టోడియల్ టార్చర్ పిటిషన్ రఘురామ సుప్రీంకు విజ్ఞప్తి

కస్టోడియల్ టార్చర్​పై త్వరగా విచారణ జరపాలని సుప్రీంకోర్టుకు వైకాపా ఎంపీ రఘురామ విజ్ఞప్తి చేశారు. జాబితాలో వచ్చినప్పటికీ ఇప్పటివరకు విచారణ జరగలేదన్నారు.

mp raghu requested to supreme to investigate custodial torcher petition
mp raghu requested to supreme to investigate custodial torcher petition

By

Published : Aug 12, 2021, 1:34 PM IST

Updated : Aug 12, 2021, 4:04 PM IST

వైకాపా ఎంపీ రఘురామరాజు.. కస్టోడియల్ టార్చర్​పై తన పిటిషన్​ను త్వరగా విచారణ జరపాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. పలుమార్లు తన పిటిషన్ విచారణ జాబితాలో వచ్చిందన్న రఘురామ.. విచారణ మాత్రం జరగలేదన్నారు. స్పందించిన జస్టిస్ వినీత్ శరణ్ ఈ విషయమై రిజిస్ట్రీకి తగిన ఆదేశాలిస్తామని తెలిపారు.

పార్టీ హెడ్‌ క్వార్టర్స్‌ మార్చినంత త్వరగా కోర్టును మారుస్తారా?

పార్టీ ఫిరాయింపుల చట్టంలో షెడ్యూల్‌ 10ని తాను ఉల్లంఘించడం లేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఫిరాయింపుల అంశంపై విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైకాపా ఎంపీలు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజును కలిసిన నేపథ్యంలో రఘురామ దిల్లీలో మీడియాతో మాట్లాడారు. కర్నూలుకు హైకోర్టు మార్చాలని కేంద్ర మంత్రిని తమ ఎంపీలు కోరారని.. పార్టీ హెడ్‌ క్వార్టర్స్‌ మార్చినంత త్వరగా కోర్టును మారుస్తారా? అని ఆయన ప్రశ్నించారు. తిరుమల వెంకన్ననూ వదలడం లేదని.. తితిదే నుంచి రూ.50 కోట్లు తీసుకోవాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారని ఆక్షేపించారు.

ఇదీ చదవండి:VIVEKA MURDER: కొనసాగుతున్న దర్యాప్తు..విచారణకు హాజరైన వివేకా పీఏ కృష్ణారెడ్డి

Last Updated : Aug 12, 2021, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details