రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. అమరావతి రైతుల త్యాగాలను అపహాస్యం చేస్తూ మాట్లాడటం సరికాదన్నారు. గురువారం రైతులు చేపట్టిన ఉద్యమంతో రాష్ట్ర ప్రభుత్వంలో కంగారు మొదలైందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రోడ్లే లేనప్పుడు పన్నులు ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారని తెలిపారు. పింక్ డైమండ్ గురించి నిష్పక్షపాతంగా సీబీఐ విచారణ జరిపిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కేసులు వాదించడానికి ప్రజల సొమ్ము రూ.2 కోట్లు ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు. కోర్టు ఖర్చుల కోసం రూ.కోట్లు ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు.
రైతుల ఉద్యమంతో ప్రభుత్వంలో కంగారు మొదలైంది: ఎంపీ రఘురామ - అమరావతి రైతుల పోరాటం వార్తలు
గురువారం అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమంతో రాష్ట్ర ప్రభుత్వంలో కంగారు మొదలైందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన... రైతుల త్యాగాలను అపహాస్యం చేస్తూ వైకాపా నేతలు మాట్లాడటం సరికాదన్నారు.
mp raghu ramakrishna raju