ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నన్ను తొలగించడం మీ వల్ల కాదు: ఎంపీ రఘురామకృష్ణరాజు - ఎంపీ రఘురామకృష్ణరాజు వార్తలు

తాను వైకాపా ఆదేశాలను ధిక్కరించట్లేదని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపితే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ నుంచి తొలగించలేరని స్పష్టం చేశారు. పార్టీ రక్షణ కోసం పాటుపడే వారిలో తానూ ఒకడినని చెప్పారు.

mp-raghu-ramakrishna-raju-comments-on-ysrcp-mps-and-cm-jagan
నన్ను తొలగించడం మీ వల్ల కాదు: ఎంపీ రఘురామకృష్ణరాజు

By

Published : Sep 15, 2020, 1:16 PM IST

Updated : Sep 15, 2020, 4:04 PM IST

నన్ను తొలగించడం మీ వల్ల కాదు: ఎంపీ రఘురామకృష్ణరాజు

తాను వైకాపా ఆదేశాలను ధిక్కరించట్లేదని ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. లోపాలను ఎత్తిచూపడం తప్పు అంటున్నారని తెలిపారు. చేస్తున్న తప్పులను సరిద్దిద్దుకోవాలని సూచించడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. కొన్ని అంశాల్లో అవినీతి జరుగుతున్నట్లు సీఎం జగన్ కు తెలిసి జరుగుతున్నాయా లేదా అని ఆలోచించుకోవాలని సూచించారు. చుట్టూ ఉన్నవారు చేసే పనులు ఒకసారి గమనించాలని సీఎం జగన్ ను కోరారు. ఈ మధ్య కాలంలో పార్టీలోని అన్ని వ్యవహారాలను ఓ అధికారి పర్యవేక్షిస్తున్నాడని వెల్లడించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరూ ఏ పనీ చేయలేరన్న ఆయన... ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు.

పార్టీలో కులం, మతం ఆధారంగా వివక్ష చూపుతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డి తీరు సరిగా లేదంటూ విమర్శలు గుప్పించారు. ఆయన వైఖరిపట్ల ఎంపీలు తీవ్ర అసహనంతో ఉన్నారని చెప్పారు. కేవలం ఒక సామాజికవర్గానికి మాత్రమే పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్ లో అత్యధిక హాజరుశాతం, ప్రశ్నలు అడిగిన తనలాంటి వంటి వాడిని మాత్రం లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

'మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే అనుమానం కలుగుతోంది. ప్రజలు ఓటేస్తేనే గెలిచామని గుర్తుంచుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలి. నాపై అనర్హత వేటు వేయాలని ఎంపీ మిథున్‌రెడ్డి మళ్లీ కోరుతామంటున్నారు.అనర్హతపై రాజ్యాంగంలో షెడ్యూల్ 10ని చదువుకోవాలని మా పార్టీ ఎంపీలకు సూచిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ పనుల గురించి ఏనాడైనా మిథున్ రెడ్డి మాట్లాడారా..?. రైల్వే జోన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఏం సాధించింది? నీటి పారుదల శాఖ, రోడ్ల నిర్మాణంలో బీభత్సమైన అవినీతి జరుగుతుంది. పార్టీ లోక్ సభాపక్షనేతకు ఎన్నిక పెట్టండి. మిథున్ రెడ్డికి మూడు ఓట్లకు మించి రావు. నన్ను పార్టీ నుంచి బహిష్కరించినా.. నేను పార్లమెంట్ లో కమిటీ ఛైర్మన్ గానే కొనసాగుతాను. సవాలు విసురుతున్నా కావాలంటే బహిష్కరించి చూడండి' -

రఘురామకృష్ణరాజు, ఎంపీ

--

ఇదీ చదవండి:

అమరావతి భూములపై విచారణ... 12 మందిపై ఏసీబీ కేసు

Last Updated : Sep 15, 2020, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details