ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అమరావతిలో ఆందోళన చేస్తున్నవారిపై పోలీసుల ప్రవర్తన దారుణం' - ఎంపీ రఘురామ తాజా వార్తలు

అమరావతిలో పోలీసుల ప్రవర్తన దారుణంగా ఉందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు. మానవహక్కులకు ఠాణాల్లోనే భంగం కలుగుతోందని.. సుప్రీం కోర్టుకు కూడా ఇదే మాట చెప్పిందని అన్నారు.

రఘురామ
రఘురామ

By

Published : Aug 9, 2021, 6:38 PM IST

అమరావతిలో ఆందోళన చేసినవారిపై పోలీసుల ప్రవర్తన దారుణంగా ఉందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు. మానవహక్కులకు ఠాణాల్లోనే భంగం కలుగుతోందని.. సుప్రీం కోర్టుకు కూడా ఇదే మాట చెప్పిందని ఆయన గుర్తు చేశారు. తనకే కాకుండా చాలా మందికి ఇలాగే జరుగుతున్నట్లు తెలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పరిధి దాటే పోలీసులకు శిక్ష తప్పదని సుప్రీం వ్యాఖ్యలతో తెలుస్తోందని ఎంపీ తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో దూషణలకు ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం అవుతోందని రఘురామ ఆరోపించారు. వివేకా హత్య కేసులో విజయసాయిరెడ్డిని.. సీబీఐ ప్రశ్నించాలన్నారు. ఇక.. తాను కనపడటం లేదని తనపై ప్రచారం చేయిస్తున్నారని రఘురామ పేర్కొన్నారు. సీఎం కనపడటం లేదని చాలా మంది పార్టీ నేతలు అంటున్నారని ఎద్దేవా చేశారు. ముందుగా సీఎం గడప దాటి బయటకు వచ్చి అందరికి కనిపించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details