ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మద్యం దుకాణాలు కాదు.. మందుల షాపులపై దృష్టి పెట్టండి: ఎంపీ రఘురామ - ఎంపీ రఘరామ తాజా వార్తలు

కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు పెరుగుతున్నా.. కనీసం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఆక్సిజన్ కొరత, కేసుల నియంత్రణపై దృష్టి సారించాలని హితవు పలికారు.

mp raghu rama krishnam
mp raghu rama krishnam raju slams ycp govt

By

Published : May 4, 2021, 8:49 PM IST

రాష్ట్రంలో కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతుంటే.. చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తనను నియోజకవర్గానికి రావాలని చెబుతున్నారని.. అక్కడ తనపై కేసులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం దృష్టి సారించటం లేదని విమర్శించారు.

కరోనా మందుల షాపులు ఏర్పాటు చేయకుండా.. మద్యం దుకాణాలపై దృష్టిపెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆక్సిజన్ కొరత, కరోనా నియంత్రణ చర్యలపై సమీక్షించాలని కోరారు. తిరుపతి ఉప ఎన్నికలో గెలిచిన అనంతరం వైకాపా నేతలు సీఎంను కలిసిన ఫొటోను ప్రదర్శించారు. ఏ ఒక్కరూ మాస్క్ పెట్టుకోలేదని దుయ్యబట్టారు. ప్రజలకు ఓ చట్టం.. ప్రజాప్రతినిధులకు ఒక చట్టమా..? అని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details